- Obesity related health problems,స్థూలకాయ సంబంధిత వ్యాధులు
స్థూల కాయం (Obesity) అనగా శరీరంలో అవసరానికి మించి కొవ్వు చేరి ఆరోగ్యానికి చెరుపు చేసే ఒక వ్యాధి. ఒక వ్యక్తి తన ఎత్తుకు ఎంత బరువు ఉండాలన్నది బాడీ మాస్ ఇండెక్స్ (Body Mass Index) సూచిస్తుంది. ఏ వ్యక్తికైనా ఇది 30 కె.జి/ చదరపు మీటరుకు పైన ఉంటే స్థూలకాయంగా లెక్కిస్తారు. . దీనివల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు, డయాబెటిస్, నిద్రలో సరిగా ఊపిరి సరిగా తీసుకోలేకపోవడం (గురక), కీళ్ళకు సంబంధించిన వ్యాధులు, కొన్ని రకాలైన క్యాన్సర్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మోతాదుకు మించి ఆహారం తీసుకోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, కొన్ని సార్లు వారసత్వం కూడా దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
సరైన రీతిలో ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం దీనికి ముఖ్యమైన చికిత్సలు. వీటి వల్ల కాకపోతే స్థూలకాయానికి వ్యతిరేకంగా ఆకలి తగ్గించేందుకు కొవ్వులను సంగ్రహించే సామర్థ్యాన్ని తగ్గించేందుకు కొన్ని మందులు ఉన్నాయి.
- ==========================
Visit my website at :
Dr.Seshagirirao.com _