Friday, January 10, 2014

Food for Work Scheme , పనికి ఆహారపధకం




  •  
 భారత దేశంలో అమలవుతున్న "జాతీయ పనికి ఆహార పథకం పటిష్టంగా అమలు జరిపేందుకు చర్యలు చేపట్టింది.   ఆహార భద్రత-ఉపాధి పథకాలను భారత దేశం లాంటి అభివృద్ధి చెందుతున్న-బీద దేశాలలో అమలు పరచడం మామూలే. "సంపూర్ణ గ్రామీణ రోజ్ గార్ యోజన పథకం", "జాతీయ పనికి ఆహార పథకం" అలాంటివే. ఆర్థికంగా-సామాజికంగా వెనుకబడిన తరగతుల వారికి, దారిద్ర్య రేఖకు దిగువనున్న గ్రామీణ పేద కుటుంబాల వారికి ఆహారంతో పాటు, ఉపాధి కలిగించే ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలివి. "జాతీయ పనికి ఆహార పథకం" కింద దేశంలోని గ్రామాల్లో నివసిస్తున్న అత్యంత వెనుకబడిన కుటుంబాల వారిని గుర్తించి, ప్రతి కుటుంబానికి నెల రోజుల పాటు ఉపాధి కలిగించి, పనిచేసిన వారికి ఆర్నెల్ల పాటు బియ్యం, డబ్బులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. సరిగ్గా అలాంటిదే అమెరికాలో ఇటీవల కాలంలో పలువురిని ఆదుకుంటున్న "ఫుడ్ స్టాంపుల పథకం". ఎప్పుడో 1961లో పైలట్ ప్రోగ్రాంగా అప్పట్లో నెల కొన్న ఆర్థిక పరిస్థితులను అధిగమించడానికి చట్టంగా చేపట్టేరు .
  • ==============================
Visit my website at : Dr.Seshagirirao.com

No comments:

Post a Comment

Thank for Comment ... Your comment has been sent to Blogger . Your comment is more valuable for improvement of my blog.